JNV Entrance Exam: Jawahar Navodaya Vidyalaya 6th Class Entrance Test 2025

JNV Entrance Exam

దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించవల్సిన జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 తేదీ వచ్చేసింది. వచ్చే ఏడాది (2025) జనవరి 18వ తేదీన ఎంట్రన్స్‌ టెస్ట్ జరుగనుంది. ఈ పరీక్ష ఫలితాలు అదే ఏడాది మార్చి నెలలో వెల్లడి చేయనున్నారు. ఇప్పటికే ఈ పరీక్షకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. సెప్టెంబర్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో15 చొప్పున విద్యాలయాలు ఉన్నాయి.

JNV Entrance Exam

ISRO HSFC Recruitment 2024
ISRO HSFC Recruitment 2024: Apply Online for 103 Assistant, Medical Officer Vacancies.

ఈ పరీక్ష రెండు సెషన్ల చొప్పున జరుగుతుంది. ఏప్రిల్‌ 12, 2025 (శనివారం) ఉదయం 11 గంటలకు ఒక సెషన్‌ పరీక్ష జరుగుతుంది. మిగిలిన విద్యార్ధులకు జనవరి 18, 2025వ తేదీ ఉదయం 11.30 గంటలకు రెండో సెషన్‌ పరీక్ష జరుగుతుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ, పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు వసతి సౌకర్యం కల్పించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలల్లో ఐదో తరగతిలో చదువుతూ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మే 1, 2013 నుంచి జులై 31, 2015 మధ్యలో జన్మించి ఉండాలి. ప్రవేశ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

 

AP Constable Jobs
AP Constable Jobs: Physical Fitness Test Schedule for Andhra Pradesh Police Constable jobs is not released yet

Loading

I'm Kesava, a passionate content creator and news presenter in Alluri Sitaramaraju District with experience at GenX Network. Sharing all things local news and Tribal issues. 🌐✨ #ContentCreator #LocalNews

Leave a Comment