High Alert For AP- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏపీకి వర్షాలే వర్షాలు

High Alert For AP

విజయవాడ విలవిల లాడుతోంది.వరద ఉధృతి తగ్గినా ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ నగరం. నాలుగు రోజులుగా నగర ప్రజలు జలదిగ్బంధంలో అల్లాడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. నాలుగు రోజులు గుడుస్తున్నా ఇంకా వరద బాధితుల ఆకలికేకలు, ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా చాలా మందికి ఆహారం, మంచినీళ్లు అందని పరిస్థితి కనిపిస్తోంది. వరద బాధితులను కాపాడేందుకు NDRF, SDRF బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవాళ కూడా పెద్దఎత్తున ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని సహాయక చర్యలు కొనసాగుతున్నా అనేక కాలనీల్లో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ కూడా కృష్ణా జిల్లాల్లోని పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు.

 

AP Dussehra Holidays 2024: Andhra Pradesh Government will announce Dussehra holidays for schools from October 4 to 13
మరిన్ని వార్తల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Loading

Heavy Rain Effect
Heavy Rain Effect: వాయుగుండంగా మారిన అల్పపీడనం ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.

I'm Kesava, a passionate content creator and news presenter in Alluri Sitaramaraju District with experience at GenX Network. Sharing all things local news and Tribal issues. 🌐✨ #ContentCreator #LocalNews

Leave a Comment