AP DSC 2024 Free Coaching – 3 నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

AP DSC 2024 Free Coaching

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ISRO HSFC Recruitment 2024: Apply Online for 103 Assistant, Medical Officer Vacancies.
మరిన్ని వార్తల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Loading

AP Constable Jobs
AP Constable Jobs: Physical Fitness Test Schedule for Andhra Pradesh Police Constable jobs is not released yet

I'm Kesava, a passionate content creator and news presenter in Alluri Sitaramaraju District with experience at GenX Network. Sharing all things local news and Tribal issues. 🌐✨ #ContentCreator #LocalNews

Leave a Comment